జర్నలిస్టులకు ప్రభుత్వ సాయం అందించండి ఇజ్రాయిల్ కుటుంబానికి అండగా నిలవాలి అనారోగ్యం బారిన పడిన పాత్రికేయులను పరామర్శించిన గంట్ల ఆర్ధిక సహాయం అందజేత ముఖ్యమంత్రి సహాయ నిధికి లేఖ..
విశాఖపట్నం :విశాఖ సందేశం: అక్కయ్యపాలెం: మే 22 :సమాజం కోసం నిరంతరం పాటుపడుతూ అనారోగ్యం బారిన పడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పెద్ద మనస్సుతో సహాయం అందించాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ర్ట నాయకులు గంట్ల శ్రీనుబాబు కోరారు. ఈ మేరకు అనారోగ్యం బారిన పడిన ఇద్దరు సీనియర్ జర్నలిస్టులను శుక్రవారం గంట్ల శ్రీనుబాబు పరామర్శించి దైర్యం చెప్పారు. ఇదే సమయంలో వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే ఇద్దరు పాత్రికేయులకు తన వంతు ఆర్ధిక సహాయం అందజేశారు.
ఇజ్రాయిల్ కుటుంబానికి అండగా నిలవాలి
సీనియర్ పాత్రికేయుడిగా సుదీర్ఘ కాలం పాటు పత్రికా రంగంలో సేవలందించిన ఇజ్రాయిల్ ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో నడుము విరిగిపోగా కాలు, చేతులుకు కూడా బలమైన గాయాలయ్యాయి. దీంతో మూడుచోట్ల ఆపరేషన్ లు జరిగాయి. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఇంటివద్దనే ఉంటూ వైద్య సహాయం పొందుతున్నారు. అలాగే ఇజ్రాయిల్ కుమారుడు సువర్ణరాజ్ కూడా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం వారంలో మూడు రోజులు డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇజ్రాయిల్ భార్య కూడా అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురు అనారోగ్యం కారణంగా తీవ్ర ఇబ్బందులతో అల్లాడుతున్నారు. అయితే అటువంటి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాల్సి ఉంది. మరో జర్నలిస్టు బి.సూరిబాబు తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నాడు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి లేఖ..
అనారోగ్యం బారిన పడిన సీనియర్ జర్నలిస్టు ఇజ్రాయిల్ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ర్ట ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకు లేఖ రాయనున్నట్లు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వైధ్య ఖర్చుల నిమిత్తం నిధులు కేటాయించాలని కూడా ఆ లేఖలో కోరనున్నట్లు చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనారోగ్యం బారిన పడడం, ఆపై ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న జర్నలిస్టు ఇజ్రాయిల్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి తప్పకుండా సహాయం అందించే అవకాశం ఉందని గంట్ల శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఆర్ధిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. లేని పక్షంలో పేదరికం కారణంగా చాలీ చాలని వేతనాలుతో చాలా మంది జర్నలిస్టులు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు.
నిజంగా మన గౌరవనీయ నాయకులు శ్రీ గంటల శ్రీనూబాబు గారు పాత్రికేయులకు మరియు పేద ప్రజలకు గొప్ప మానవతా సేవ చేస్తున్నారు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును ప్రసాదించుగాక.
కె.వి.శర్మ, సంపాదకుడు.




Comments
Post a Comment