శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. స్వామి వారి నిత్య అన్నప్రసాద పథకానికి దాత దాడి చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల విరాళం
సింహాచలం 28 మే 2026. విశాఖపట్నం కొత్తపాలెం ప్రాంతానికి చెందిన దాత శ్రీ దాడి చంద్రశేఖర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని తమ ఉదారతను చాటుకున్నారు. శ్రీ స్వామి వారి నిత్య అన్నప్రసాద నిధికి ఆయన తన కుటుంబ సమేతంగా రూ. 1,00,116/- (అక్షరాలా ఒక లక్షా నూట పదహారు రూపాయలు) విరాళంగా ప్రకటించారు.
ఈ మేరకు దేవస్థానం కార్యాలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జె. వెంకట్రావు ని కలసి, విరాళానికి సంబంధించిన చెక్కును దాత మరియు వారి కుటుంబ సభ్యులు కలసి ఈఓ చేతుల మీదుగా అందజేశారు.
విరాళం సమర్పించిన అనంతరం దాత దాడి చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు స్వామి వారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు దాత దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనం పలికారు.
ఈ సందర్భంగా ఆలయ ఈఓ శ్రీ జె. వెంకట్రావు దాతను మరియు వారి కుటుంబ సభ్యులకు స్వామి వారి, లడ్డూ ప్రసాదాలను అందజేశారు

Comments
Post a Comment