ఋషికొండ క్యాంపస్‌లో డిజిటల్ లిటరసీ మరియు ఏఐ టూల్స్‌పై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగింపు
విశాఖ : విశాఖ సందేశం : స్థానిక గాయత్రీ కళాశాలలో ఋషికొండ క్యాంపస్ లో జరిగిన మూడు రోజుల క్వాలిటీ అడ్మినిస్ట్రేషన్ త్రూ డిజిటల్ లిటరసీ అండ్ ఏఐ టూల్స్ కార్యశాల విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 53 మంది ఆఫీస్ సిబ్బంది మూడు రోజులు నిరంతర శిక్షణ పొందారు. మొదటిరోజు భరత్ గొలగాని గారు, గంటి సూర్య, నేమాని సాయి కృష్ణ లు ఏఐ టూల్స్ గురించి మరియు రైట్ ప్రాంప్ట్స్ గురించి చెప్పడం జరిగింది.
రెండవ రోజు ఆంధ్ర యూనివర్సిటీ స్కాలర్ శ్రీ హరి నాగరాజు గారు సైబర్ సెక్యూరిటీ మీద సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మూడవరోజు శ్రీ రామ్ కౌశిక్ గారు ఆఫీసు సిబ్బందికి కావలసిన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద శిక్షణ ఇచ్చారు.
మూడో రోజు జరిగిన ముగింపు సభలో డీన్ ప్లేస్మెంట్స్ ప్రొఫెసర్ డి సరిత గారు మరియు ఐక్యుఏసి కోఆర్డినేటర్ ప్రొఫెసర్ బిహెచ్ పద్మ గారు, కన్వీనర్ డాక్టర్ సాయిబాల గారు పాల్గొని సిబ్బందికి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.
కె. వి. శర్మ, ఎడిటర్,



Comments
Post a Comment