Skip to main content

ఉపాధి హామీ పనులు కల్పించాలంటూ గోపవరం మహిళలు నిరసన..... ఫిల్డ్ అసిస్టెంట్ లేకపోవడంతో పనులు లేవంటూ ఆవేదన.....

 

ఉప్పలగుప్తం, విశాఖ సందేసం....ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న ఉపాధి హామీ పధకంలో పనులు కల్పించాలంటూ ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామం రావులమ్మపేట చెందిన  మహిళలు సచివాలయం వద్ద నినాదాలుతో కూడిన నీరసస చేపట్టారు. గ్రామంలో ఫిల్డ్ అసిస్టెంట్ లేకపోవడంతో గత రెండు నెలల నుండి ఉపాధి హామీ పనులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 


రావులమ్మ పేటలో సుమారు 300 మంది ఉపాధి కూలీలు ఉన్నామని సరిపెల్ల ఫిల్డ్ అసిస్టెంట్ ఇంచార్జ్ గా నియమించారాని అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామంలో కొంతమందికి పనులు కల్పించి  మా రావులమ్మ పేట ప్రజలకు పనులు కల్పించడంలేదని  వాపోయారు. ఉపాధి పనులపై జీవినాదారం సాగించే మాకు పనులు లేకపోవడంతో కుటుంబ జీవనం సాగడం లేదని ఉపాధి కూలీలు మీడియా ముందు గోడు వెళ్ళగక్కారు. తక్షణమే ఫిల్డ్ అసిస్టెంట్ ను నియమించి ఉపాధి పనులు చూపించాలని నినాదాలు చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు తమ సమస్య పరిష్కరించాలని రావులమ్మ పేట వాసులు ముక్తకంఠంతో కోరారు. ఈ కార్యక్రమంలో అంబటి ఏడుకొండలు, పొలమూరి అర్చమ్మ, అయిటి సత్యవతి, కాకర గంగా రత్నం, ఉటాల బేబీ శైలజ, పండు పల్లాలమ్మా  కుంచే మంగాదేవి, తాళ్ల మణి, ములపర్తి సుమతి అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

              Srinivas Spl Correspondant 

Comments