విశాఖపట్నం: పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026లో భాగంగా విశాఖపట్నం జిల్లా ప్రశిక్షణ వర్గ్‌లో రెండో రోజు ఉదయం నిర్వహించిన యోగా సెషన్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN Madhav పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. శరీరానికి శక్తిని, మనసుకు ప్రశాంతతను అందించే యోగ సాధన ప్రతి కార్యకర్త దైనందిన జీవితంలో భాగం కావాలని ఆకాంక్షించారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణకు యోగ ఎంతో అవసరమని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఏకాగ్రతను పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి వార్డు స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
యోగను ప్రజా ఉద్యమంగా మార్చి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, శిక్షణ వర్గ్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
K.V.SHARMA EDITOR


Comments
Post a Comment