Skip to main content

మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది : పట్టణ సీఐ వీరబాబు....



 అమలాపురం, విశాఖ సందేసం....వాసవి క్లబ్       అమలాపురం ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు అప్పన్న వీరన్న  స్వగృహం  వద్ద వేసవికాలం సందర్భముగా దాతల సహకారంతో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని శుక్రవారం అమలాపురం పట్టణ సీఐ పి వీరబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధులుగా  పట్టణ సీఐ వీరబాబు,  శ్రీ సుబ్బాలమ్మ, నూకాలమ్మ, రాజ్యలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం ధర్మకర్తల పాలకమండలి చైర్మన్ అప్పన వీరన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ వీరబాబు  మాట్లాడుతూ వేసవిలో బాటసారుల  దాహార్తిని తీర్చేందుకై వాసవి క్లబ్ ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం నేటికి 75వ రోజు సందర్భంగా తాను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ తాడికొండ బుజ్జి, కార్యదర్శి తటవర్తి సురేష్, కోశాధికారి గోకవరపు పరమేష్, నంబూరి నరేష్, చక్క ప్రవీణ్ తదితరులు పాల్గొని వారి సేవలను అందించారు.

               Srinivas Spl Correspondant 

Comments