Skip to main content

​శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. ​ సింహాచల భక్తుల సేవలో స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలి: ...............ఆలయ ఈఓ జల్లేపల్లి వెంకటరావు


సింహాచలం 26 మే 2026: శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వాములు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు పిలుపునిచ్చారు. 

మంగళవారం ఆలయ ప్రాంగణంలో వివిధ సేవా సంస్థల ప్రతినిధులతో ఆయన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

​ఈ సమావేశంలో వసుంధర ఆలయ సేవ, నారాయణ సేవ, శ్రీహరి సేవ, హరికృష్ణ జ్వాల నరసింహ సేవ, శ్రీ వరాహలక్ష్మి నరసింహ సేవ, మరియు శ్రీ లలితా దేవి సేవా సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఈఓ జల్లేపల్లి వెంకటరావు మాట్లాడుతూ, దేవస్థానానికి వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, వారికి అవసరమైన మౌలిక వసతులను సత్వరమే అందించడానికి స్వచ్ఛంద సంస్థల సేవలను దేవస్థానం ఉపయోగించుకుంటుందని తెలిపారు. 

భక్తులకు నిరంతరాయంగా సేవలు అందించే ఈ పవిత్రమైన కార్యంపై వాలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి, నిస్వార్థంగా సేవ చేయాలని కోరారు.

​దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన డిజిటల్ సేవలపై ఈఓ ప్రత్యేకంగా చర్చించారు. ఆలయంలో క్యూ లైన్ల నిర్వహణతో పాటు, 'మనమిత్ర' ఆన్‌లైన్ యాప్, కియాస్క్ (Kiosk) కేంద్రాలు మరియు సింహాచలం ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్ విధానం ద్వారా భక్తులు సులభంగా ఆన్‌లైన్ టికెట్లను పొందేలా ​ఆన్-లైన్ సేవలపై అవగాహన కల్పించాలి సేవా వాలంటీర్లు తగిన మార్గదర్శకత్వం వహించాలని, వారికి అవగాహన కల్పించడంలో తోడ్పడాలని కోరారు.

​సమావేశంలో పాల్గొన్న సేవా సంస్థల అధ్యక్షులు, వారి ప్రతినిధులు మాట్లాడుతూ, స్వామివారి భక్తులకు సేవ చేసుకునే మహత్తర భాగ్యాన్ని, వాలంటీర్లను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినందుకు ఆలయ ఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దేవస్థాన నియమ నిబంధనలకు కట్టుబడి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ వాలంటీర్లు పూర్తి స్థాయిలో సహకరిస్తారని హామీ ఇచ్చారు.

​ఈ సమావేశంలో సహాయ కార్యనిర్వహణాధికారి  శ్రీ పిల్లా శ్రీనివాసరావు, దేవస్థాన అధికారులు మరియు వివిధ సేవా సంస్థల ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

​-             పి.ఆర్.ఓ, సింహాచలం దేవస్థానం

Comments