సింహాచలం 22 మే 2026. సింహాద్రి అప్పన్న భక్తకోటికి ఇదో ఒక సువర్ణావకాశం! ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి జన్మనక్షత్రమైన “స్వాతి” నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీన అత్యంత వైభవంగా “స్వాతి హోమం” నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేయనుంది.
సాధారణంగా నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రానికి హైందవ ధర్మంలో ఎంతో విశిష్టత ఉంది. అలాంటిది, సాక్షాత్తు స్వాతి నక్షత్రాధిపతి అయిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి స్వయంభూ క్షేత్రంలో.. స్వామివారి వార్షిక కళ్యాణ వేదికపై ఈ మహా హోమాన్ని నిర్వహించడం వేదఘోషలు, మంత్రోచ్చారణలు, హోమాగ్ని జ్వాలల మధ్య సింహగిరి మొత్తం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించనుంది.
లక్ష్మీనరసింహుని దివ్య హోమగుండం నుండి వెలువడే పవిత్ర ధూమం, వేదమంత్రాల స్పందనలు భక్తుల జీవితాల్లోని సకల అరిష్టాలను తొలగించి, సర్వ శుభాలను చేకూరుస్తాయి అని ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టి పి రాజగోపాల్ తెలియజేశారు.
యుగయుగాలుగా భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్న సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగే "స్వాతి హోమం" ఒక అరుదైన దైవానుభూతి. జీవితంలో మానసిక ప్రశాంతతను, దైవానుగ్రహాన్ని ప్రసాదించే ఈ మహా యజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా దేవస్థానం భక్తులను ఆదరపూర్వకంగా ఆహ్వానిస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక వైదిక మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా "సింహగిరికి వచ్చే ప్రతి భక్తుడూ ఆధ్యాత్మిక ఆనందంతో తిరిగి వెళ్లాలనేదే మా సంకల్పం. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, మజ్జిగ సరఫరా నిరంతరం జరిగేలా చర్యలు తీసుకున్నాం."దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ విశిష్ట స్వాతి హోమంలో పాల్గొనదలిచే భక్తుల కోసం దేవస్థానం ఆన్‌లైన్ సేవలను సులభతరం చేసింది.
చివరి తేదీ: మే 27వ తేదీ వరకు మాత్రమే టికెట్లు అందుబాటులో ఉంటాయి.
భక్తులు ఆఖరి నిమిషం వరకు వేచి ఉండకుండా, దేవస్థానం వారి ప్రత్యేక “మనమిత్ర” వాట్సాప్ (WhatsApp) సేవ ద్వారా ఎంతో సులభంగా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఆలస్యం చేయకండి.. వెంటనే మీ టికెట్ బుక్ చేసుకోండి, లక్ష్మీనరసింహుని కృపాకటాక్షాలు పొందండి!



Comments
Post a Comment