Skip to main content

ఈరోజు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే & బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు


ఈరోజు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే & బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు & గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారితో కలిసి వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్ సెంటర్‌కు స్థలం కేటాయింపు విషయంపై కలెక్టర్ గారితో చర్చించారు.

ఈ అంశంపై కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు పంపించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్ అధ్యక్షులు శ్రీ చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) గారు, కె. బాలాజీ గారు, శ్రీ కన్య గురుమూర్తి గారు, బుల్లిబాబు గారు, కంటిపూడి వెంకటేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు.

Comments