భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని శ్రీనిధి అసోసియేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ లు సిరికి సంతోష్ కుమార్, సిరికి రవిరాజ్ తెలిపారు
విశాఖ: విశాఖ సందేశం : విశాఖ ఉత్తర నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆఫీసులో నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, బిజెపి విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరుశురామరాజు, విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పొట్నూరు వెంకట కృష్ణ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ బాబు , హిందూ హైందవ ధార్మిక చైర్మన్ బుద్ధా శివాజీ తదితర ప్రముఖుల సమక్షంలో బుధవారం శ్రీనిధి అసోసియేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ లు సిరికి సంతోష్ కుమార్ ,సిరికి రవిరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వారికి పార్టీ జెండా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా సిరికి సంతోష్ కుమార్ ,సిరికి రవిరాజ్ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు, పార్టీ విధివిధానాలు చూసి బిజెపి పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో సభ్యత్వాలు తీసుకున్నామని తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం తామందరం పనిచెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.వీరితోపాటు రాజన్న, ప్రవీణ్ కుమార్, ఐతం మధు కుమార్, పొట్నూరు సుమంత్ తదితరులు 60 మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.
K.V.SHARMA EDITOR


Comments
Post a Comment