బిజెపి జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ( ప్రజల కథ నా ఆత్మకథ) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈనెల 24వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు కాకతీయ కన్వెన్షన్ సెంటర్ మద్దిలపాలెం నందు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమ కన్వీనర్ చెరువు రామకోటయ్య గారు మాట్లాడుతూ బండారు దత్తాత్రేయ గారు తన తొమ్మిదో యేటా నుండి ఆర్ఎస్ఎస్ లో పలు విభాగాల్లో పనిచేయడంతో పాటు భారతీయ జనతా పార్టీలో పలు అత్యున్నతమైన పదవులు అధిరోహించారని, వారు పార్లమెంట్ సభ్యులుగాను కేంద్ర మంత్రిగా ఆ తర్వాత గవర్నర్ గా పనిచేసినట్టు గుర్తు చేశారు.
దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై వేగంగా స్పందించే వారిని తెలియజేశారు.
మే 24వ తేదీ జరగబోయే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, శాసనమండలి ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు గారు, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జివిఎల్ నరసింహారావు గారితో పాటు దత్తాత్రేయ గారితో కలిసి పనిచేసిన ప్రజా ప్రతినిధులందరికీ ఆహ్వానించడం జరిగిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మీడియా కో కన్వీనర్డిఎస్ వర్మ గారు పాల్గొన్నారు
D.S.Varma Sr Sub EDITOR

Comments
Post a Comment