విశాఖ దక్షిణనియోజకవర్గం నియోజకవర్గ ఇంచార్జ్, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పర్యవేక్షణలో వార్డు అధ్యక్షుడు బత్తిన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మహానాడు 2026 రెండవ రోజు గురువారం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి సందర్బంగా కేక్ కటింగ్ తో వేడుకలు ప్రారంభించారు.దక్షిణ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ 31వార్డు మహానాడు వేదికను సందర్శించి నాయకులను ప్రోత్సహించి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా నవీన్ కుమార్ సీనియర్ నాయకులను,కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సత్కరించి గౌరవించారు.అనంతరం నవీన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలు,యువగళం,పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన, పార్టీలో యువతకు ప్రాధాన్యత,పేదల సేవలో సూపర్6 పథకాలు, అన్న కాంటీన్లు, రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సాయం తదితర విషయాలను,అమలు చేస్తున్న పథకాలను వివరించారు. వార్డులో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకి,అభివృద్ధి కోసం దిశనిర్దేశం చేసారు.31వార్డులో మహానాడు విజయవంతానికి కృషిచేసిన నాయకులు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు క్లస్టర్, రాష్ట్ర సెక్రటరీ వానపల్లి గాయత్రీ ఫణి కుమారి, కోక్లస్టర్ పల్లా నగేష్, సెక్రెటరీ పీ అప్పలరాజు, సీనియర్ నాయకులు డీ మూర్తి,కేవీ శర్మ, పోతల శ్రీనివాసరావు,కోస్ట్ శ్రీనివాసరావు,అర్జీ శంకరరావు,జక్కన వెంకటరావు,యూనిట్,బూత్ ఇంచార్జిలు,ఎన్టీఆర్ అభిమానులు,నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పెద్దఎతున్న పాల్గొని జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్, జై సీతంరాజు సుధాకర్, జై తెలుగుదేశం వంటి నినాదాలతో హోరెత్తించారు.


Comments
Post a Comment