Skip to main content

మహానాడులో మహిళానేతలతో సిఎం చంద్రబాబు స్త్రీలకు ఆత్మస్థైర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం మహానాడులో టిడిపి మహిళా నేతలు


 విజయవాడ,మే27.  విశాఖ సందేశం: మహిళలను గౌరవించడం, అన్నింట అవకాశం కల్పించడం ద్వారాస్త్రీలకు ఆత్మస్థైర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మహిళ నేతలు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడు

కార్యక్రమంలో మహిళా సాధికారతపై మహిళ నేతలు మాట్లాడుతూ మహిళ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, కుటుంబానికి ధైర్యం, సమాజానికి స్ఫూర్తి అని నమ్మింది మన తెలుగుదేశం పార్టీనేనని గుర్తు చేశారు. మహిళ బలపడితే కుటుంబం బలవడుతుంది: భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా సాధికారతకు నారీ శక్తి వందన్ అధినియం (చట్టసభల్లో 33 మహిళా రిజర్వేషన్) ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని మహిళ నేతలు అభిప్రాయపడ్డారు. ఇది కేవలం సంఖ్యాపరమైన మార్పు కోసం తెచ్చింది కాదు, దేశ విధానాల్లో మహిళల స్వరం బలంగా వినిపించేందుకు రాజకీయ నిర్ణయాల్లో వారికి సమాన భాగస్వామ్యం కల్పించేందుకు తెచ్చిన గొప్ప సంస్కరణ అని గుర్తు చేశారు. స్త్రీశక్తి థీమ్తో ఈ మహానాడు కార్యక్రమం మహిళల ఆత్మగౌరవం, సాధికారత, భద్రత కోసం తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న సంకల్పానికి ప్రతీకగా నిలవనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ మహానాడు కార్యకర్తల ఉత్సాహంతో, తెలుగుదేశం కుటుంబం శక్తితో విజయవంతం కానుంది. మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా సమాజానికి శక్తిగా గుర్తించిన ఏకైక పార్టీ తెలుగు దేశమని టిడిపి మహిళా నేతలందరూ అభిప్రాయపడ్డారు. మహిళల ఉన్నత విద్య కోసం అన్న ఎన్టీఆర్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, ఆడబిడ్డలకు చదువు ఒక అవకాశం మాత్రమే కాదు, హక్కు అని చాటి చెప్పారని వెల్లడించారు. 1986లో ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి, అమ్మాయి అంటే భారం కాదు కుటుంబ వారసత్వం అని నిరూపించారని హర్షం వ్యక్తం చేశారు. స్త్రీ అంటే కేవలం కుటుంబ బాధ్యతలు మోసే వ్యక్తి కాదు. కుటుంబానికి ధైర్యం, సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి. మహిళా సాధికారతకు నిజమైన అర్థం చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియడారు. మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసి మహిళల ఉన్నత విద్యకు బాటలు వేసిన ఘనత ఎన్టీఆర్ దని మహిళా నేతలందరూ చాటిచెప్పారు. కార్యకర్తే అధినేత అనే తీర్మానాన్ని మంత్రి సవిత మహానాడులో ప్రవేశపెట్టారు. కార్యకర్తలే పార్టీకి బలం, బలగం అన్నారు. టెక్నాలజీని ఉపయోగించి మన పార్టీలో నాయకత్వాన్ని మరింత పటిష్టంగా నిర్మించిన ఘనత మన యువ నాయకులు నారా లోకేష్ ని వెల్లడించారు. మహిళా సాధికారత కోసం మహిళలను అన్ని విధాలా లోకేష్ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ ను 2029 ఎన్నికల్లో ఇవ్వనున్నట్లు ప్రకటించిన యువనేతకు ధన్యవాదాలు, కృతజ్ఞుతలు చెప్పారు. కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీ నినాదమని వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు ప్రమాద బీమా, కష్టాల్లో ఉన్న కార్యకర్తల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్న ఘనత మన తెలుగుదేశం పార్టీ సొంతమన్నారు.

Comments