విశాఖ పట్నం, మే 18.నగరంలోని చినవాల్తేరు గ్రామ దేవత శ్రీ కనకమహాలక్ష్మి(దుర్గ) అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం సందర్భంగా గ్రామ ఆడపడుచులు, ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో, అమ్మవారి మాలధారణలో అమ్మవారికి సారె సమర్పించారు. పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైందవ సాంప్రదాయంగా అమ్మవారికి సమర్పించిన పసుపు కుంకుమలు సౌభాగ్య ప్రీతిక తాంబూలం, చక్కెర పొంగలి నైవేద్యంను, సారె సమర్పించిన గ్రామ ఆడపడుచులు, ముత్తైదువులకు గంధం పూసి, సుమంగళి కుంకుమను దిద్ది సౌభాగ్య ప్రీతిక తాంబూలాలు అంద చేసారు. అనంతరం కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ అమ్మవారి నైవేద్యం చక్కెర పొంగలి ప్రసాదాన్ని అందజేశారు. తాంబూలాలు అందుకున్న గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, ఇటువంటి తాంబూలం తీసుకోవడం మొదటిసారని పట్టా ఫౌండేషన్ చేస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు. గ్రామ ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని, పట్టా ఫౌండేషన్ మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఆలయ చైర్మన్ గుంటుబోయిన వెంకట నరసింహ మూర్తి యాదవ్, యువతర కల్చర్ క్లబ్ సభ్యులు ఈ నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయ మన్నారు. పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పట్టా రమేష్ బాబు మాట్లాడుతూ ఆలయ ట్రస్ట్ సభ్యులు, ఈవో తదితరులు భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం హర్షణీయ మన్నారు. ఉత్సవ అనుపు మహోత్సవం జరిగే మంగళవారం నాడు భక్తులకు మజ్జిగ పంపిణి చేస్తామన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి తమకు అవకాశం కల్పించిన ఆలయ కమిటీకి, ఉత్సవ నిర్వహకులు యువతారా కల్చర్ క్లబ్ కమిటీకి కృతఙ్ఞతలు తెలుపుతున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ట్రస్టీలు ఆర్.భాస్కర్, భారతి, బొడ్డేడ వెంకటలక్ష్మి, దొడ్డి రమేష్, ఫౌండేషన్ సభ్యులు బీశేటి అఖిల, పెంటకోట నూకరాజు, శ్రీలక్ష్మి, శ్రీదేవి, శ్యామల, అర్చన, స్వాతి ప్రియ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment