సింహాద్రి నాథుడు సేవ పూర్వజన్మ సుకృతం* *అందరి సహకారంతోనే దేవాలయాల అభివృద్ధి* *గంట్ల శ్రీనుబాబును సత్కరించిన వేదుల దక్షిణామూర్తి*
అక్కయ్యపాలెం మే 19 భక్తులు.. .దాతలు.. ఇలా అందరి సహకారంతోనే దేవాలయాల అభివృద్ధి సాధ్యమవుతుందని
సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి.. మాజీ సభ్యులు... ప్రత్యేక ఆహ్వానితులు ..జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు..
సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇటీవల నియమితులైన వేదుల దక్షిణామూర్తి మంగళవారం గంట్ల శ్రీనుబాబును అక్కయ్యపాలెం లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సింహాద్రి నాథుడు అత్యంత మహిమాన్వితులన్నారు.. అటువంటి దేవదేవుడు సేవ చేసుకునే భాగ్యం అందరికీ రాదని ఆ అవకాశం దక్షిణామూర్తికి దక్కినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు...సింహాచలం దేవస్థానం అభివృద్ధికి పూర్తిస్థాయిలో సేవలు అందించాలని.. భక్తులకు మరింతగా మెరుగైన సదుపాయాలు కల్పించాలని
ఆ దిశగా దక్షిణామూర్తి తన వంతు కృషి చేయాలని గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు.. ఈ సందర్భంగా దక్షిణామూర్తి మాట్లాడుతూ అప్పన్న దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా.. ప్రత్యేక ఆహ్వానితులుగా.. చందనోత్సవం కమిటీ సభ్యులుగా.. వివిధ అనుబంధాలయాల గౌరవ అధ్యక్షులుగా గంట్ల శ్రీనుబాబు అందిస్తున్న సేవలు ఎంతోమందికి ఆదర్శప్రాయం అన్నారు.. జర్నలిస్టుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే ఎంతోమందికి ఆపన్న హస్తం అందిస్తున్న గంట్ల శ్రీనుబాబు సేవలు ప్రశంసనీయమన్నారు. తాను కూడా శక్తివంచన లేకుండా సింహాచలం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.. ఈ సందర్భంగా దక్షిణామూర్తిని
గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా సత్కరించి అభినందనలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ధార్మిక సెల్ రాష్ట్ర కన్వీనర్ విజయ్ శంకర్ ఫణి తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment