నెల రోజులుగా మండుటెండల్లో దువ్వాడ రైల్వే స్టేషన్‌లో సాధారణ బోగీల ప్రయాణికులకు ఉచిత త్రాగునీటి పంపిణీ
రోజు మంగళవారం (26-05-2026) మండుటెండల మధ్య దువ్వాడ రైల్వే స్టేషన్‌లో “మానవ సేవే మాధవ సేవ” అనే మహోన్నత స్ఫూర్తితో 19 మంది వాలంటీర్లు వరుసగా 30వ రోజు కూడా 11 సాధారణ బోగీలలో ప్రయాణిస్తున్న సుమారు 600 మంది ప్రయాణికులకు ఉచితంగా త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు.
ధన్‌బాద్ నుండి పోదనూర్ (తమిళనాడు) వెళ్తున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్ట్ సమయంలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులతో సహా సుమారు 600 మంది సాధారణ బోగీ ప్రయాణికులకు ఒక్కో లీటర్ త్రాగునీటి బాటిళ్లను దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ మరియు శ్రీ సత్యసాయి సమితి ఆధ్వర్యంలో అందజేశారు.
27-04-2026 నుండి నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సత్యసాయి సమితి ఉక్కునగరం, మానవ వికాస వేదిక, మానవత, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, స్పందన చేయూత ఫౌండేషన్, వాయిస్ ఆఫ్ గాజువాక, అగనంపూడి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంస్థలు కలిసి ఇప్పటివరకు మొత్తం 7,392 త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశాయి.
ఈ కార్యక్రమంలో ఎస్. శివరామకృష్ణ, కే.ఎస్.ఎన్. రాజు, కామేశ్వరరావు, ఎస్.యు. అప్పలరాజు, శివకుమార్, గంగాధర్ వెంకటరావు, రవికృష్ణ, రవీంద్రరావు, జి.వి. ప్రసాద్, మస్తానయ్య, అప్పారావు, గోవిందరావు, బి.ఎస్.ఎస్. రావు, భాస్కర్, కామేశ్వరరావు, రామచంద్రరావు, విజయ్‌కుమార్, ఈశ్వర్, విజయ తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు సేవా కార్యక్రమానికి శ్రీ పి. సాయి ప్రకాష్, శ్రీ ఆర్. రాజేశ్వరరావు, శ్రీమతి ఎం. శిల్పా, ఎ. మమదీప గారు, శ్రీ ఎల్. ఈశ్వరరావు, ఆర్. చంద్రశేఖర్ గారు ఆర్థిక సహాయం అందించగా, దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.




Comments
Post a Comment