Skip to main content

కట్టమూరి సేవలు అభినందనీయం : మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఘనంగా మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ కట్టమూరి లక్ష్మీనారాయణ పదవీ విరమణ....


అమలాపురం, విశాఖ సందేసం....
అమలాపురం మున్సిపల్ కార్యాల యంలో సీనియర్ అసిస్టెంట్‌గా సుదీర్ఘకాలం సేవలందించి,62 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందుతున్న కట్టమూరి లక్ష్మీనారాయణకు మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ ,ఇతర ఉన్నతాధికారులు రిటైర్ అవుతున్న సీనియర్ అసిస్టెంట్ ని దుశ్శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.


ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్  మాట్లాడుతూ కట్టమూరి లక్ష్మీనారాయణ మున్సిపాలిటీలో అందించిన సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు.విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత,క్రమ శిక్షణ తోటి ఉద్యోగులకు ఆదర్శ ప్రాయమని తెలిపారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం 62 సంవత్స రాల వయస్సు నిండిన తర్వాత పదవీ విరమణ పొందుతున్న ఆయన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షిం చారు. పదవీ విరమణ పొందిన సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీలో తన సుదీర్ఘ సేవా కాలంలో సహకరించిన కమిషనర్ కి, తోటి అధికారులు, సిబ్బందికి, వార్డ్ సచివాలయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, వివిధ విభాగాల అధికారులు, మున్సిపల్ సిబ్బంది,సచివాలయ ఉద్యోగులు పాల్గొని పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు

               Srinivas Spl Correspondant.

Comments