Skip to main content

బంగారం కొనుగోలు ప్రకటనలపై స్వర్ణకారుల ర్యాలీ....... సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే ఆనందరావుకు వినతిపత్రం.....


అమలాపురం, విశాఖ సందేసం
....కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బంగారం కొనద్దని ఎక్కువగా వినియోగించకూడదని ఏదైతే ప్రకటన చేస్తున్నారో ఆ ప్రకటనలపై  రాష్ట్ర సంఘం పిలుపు మేరకు  బంగారం వస్తువులు చేసే స్వర్ణకారులు వ్యాపారులు వినియోగదారులు ఏ విధంగా బ్రతకాలంటూ  షాపులను ముసివేసి నిరసన తెలియజేసిన అనంతరం   


అమలాపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద స్వర్ణకారులు నాయకులు,   జిల్లా స్వర్ణకార  అధ్యక్షులు తాళాబత్తుల అపలాచార్యులు, శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మానేపల్లి సత్యప్రకాష్    ఆధ్వర్యంలోఎమ్మెల్యే అయితాబత్తుల  ఆనందరావుకు వినతి పత్రం అందజేశారు.  


ఈ కార్యక్రమంలో  భాగంగా స్వర్ణకారులు షాపులు మూసివేసి జిల్లావ్యాప్తంగా బంద్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బందుకు సంఘీభావంగా జిల్లాలో బంద్  నిర్వహిస్తున్నామని వెంటనే మా స్వర్ణకారుల యొక్క సమస్యలను డిమాండ్లను నెరవేర్చాలని ఎమ్మెల్యే ఆనందరావుకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వీర్ని శేషుబాబు, చేబోలు చంద్రశేఖర్, కట్టోజు సన్నయ్యదాసు ,కట్టోజు సుబ్బారావు, మానేపల్లి సత్య ప్రకాష్, కర్రి నారాయణరావు,అల్లక వాసు, మండ శివకుమార్,పుల్లేటికుర్తి భాస్కరరావు,అరిపాక బాబి, నలమాటి నాగబాబు,తాళబత్తుల లక్ష్మణరావు, శ్రీశైలం పండు, భరణి కన్నబాబు స్వర్ణకారులు పాల్గొన్నారు.

             Srinivas Spl Correspondant 

Comments