Skip to main content

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధిద్దాం – గుడ్డ సంచుల వినియోగాన్ని అలవాటు చేసుకుందాం. *స్వచ్ఛ సర్వేక్షన్ లో విశాఖ నగరం ప్రథమ స్థానం పొందేందుకు ప్రజలు సహకరించాలి. – జీవీఎంసీ సిఎంఓహెచ్ డాక్టర్ ఈ.ఎన్.వి.నరేష్ కుమార్.



 విశాఖపట్నం, మే 19: విశాఖ నగర పర్యావరణ        పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించి, పర్యావరణ హిత ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచనలతో జీవీఎంసీ సిఎంఓహెచ్ డాక్టర్ ఈ.ఎన్.వి. నరేష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఈస్ట్ జోన్ పరిధిలోని ఎంవిపి రైతు బజార్‌లో నిర్వహించిన “క్లాత్ బ్యాగ్ వినియోగిద్దాం" అనే అవగాహన కార్యక్రమాన్ని ఎఎంఓహెచ్ బి. ప్రసాదరావు, శానిటరీ సూపర్వైజర్ సత్యనారాయణ లతో కలిసి నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో శానిటరీ సెక్రటరీలు, పారిశుద్ధ్య కార్మికులతో కలసి పాల్గొని మార్కెట్‌కు వచ్చిన కొనుగోలుదారులు, వ్యాపారస్తులు, వినియోగదారులకు వస్త్ర సంచులను పంపిణీ చేస్తూ సీఎంహెచ్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర హానికరమని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కాలుష్యం పెరగడమే కాకుండా, జలవనరులు ,భూమి కూడా కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నిత్యావసరాల కొనుగోళ్లకు పునర్వినియోగం చేయగల గుడ్డ సంచులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.


విశాఖను పరిశుభ్ర నగరంగా ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయని, స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 విశాఖ నగరం దేశంలోనే పరిశుభ్ర నగర పోటీలలో ప్రథమ స్థానం పొందేందుకు ప్రజలందరూ తమ అమూల్యమైన అభిప్రాయాలతో సహకరించాలని తెలిపారు. ప్లాస్టిక్ రహిత విశాఖ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, పర్యావరణ హిత నగరంగా విశాఖను అభివృద్ధి చేయడానికి అందరూ బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. జీవీఎంసీ చేపడుతున్న స్వచ్ఛత మరియు ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడంతో పాటు, సుస్థిర జీవన విధానాల వైపు మళ్లించే సందేశాన్ని అందించారు.


ఈ అవగాహన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రకార్డులతో పర్యావరణహిత నగరానికి సహకరించాలని అవగాహన కార్యక్రమం లో పాల్గొన్నారు.

            పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ

                    K.V.SHARMA EDITOR 

Comments