సింహాచలం 25 మే 2026.కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మరియు పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న గౌరవ మంత్రి గారికి ఆలయ కార్యనిర్వహణాధికారి జె. వెంకట్రావు స్వాగతం పలికారు.
ఆలయ సాంప్రదాయం ప్రకారం, అత్యంత మహిమాన్వితము గల కప్ప స్తంభాన్ని మంత్రి ఆలింగనం చేసుకున్నారు.
అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనానంతరం ఆలయ వేద పండితులు మంత్రి కి వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు.
స్వామివారి శేష వస్త్రంతో ఆయనను సత్కరించి, స్వామివారి ప్రసాదాన్ని మరియు జ్ఞాపికగా స్వామివారి దివ్య సుందర ఫోటోను అందజేశారు.
దేవాలయ దర్శనం ముగిసిన అనంతరం, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి హోదాలో ఆయన కొండపైన పర్యాటక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రసాదం' పథకం కింద సింహాచల కొండపై జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు.
K.V.SHARMA EDITOR




Comments
Post a Comment