Skip to main content

బ్యాంక్ ఆఫ్ ఇండియా (వన్ టౌన్ హార్బర్ రోడ్డు విశాఖపట్నం) వివేకానంద ఆశ్రమమునకు నిత్యవసర వస్తువులు వితరణ....


వన్ టౌన్, పాత పోస్ట్ ఆఫీస్ హార్బర్ రోడ్ లో గల బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ అజారుద్దీన్, ప్రసాద్ గారు, రామ్ చరణ్ గారు 10,000 /-రూపాయల విలువ గల బియ్యం, కందిపప్పు, చింతపండు, ఆయిల్ మొదలైన నిత్యవసర వస్తువులను వివేకానంద ఆశ్రమమునకు అందించారు. వివేకానంద సంస్థ నిత్యం అన్నదానాలు చేస్తూ ఉండడం, మేము తెలుసుకొని మా సిబ్బంది ద్వారా నిత్యవసర వస్తువులను అందించినట్లు తెలియజేశారు. వారికి ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు సూరాడ. అప్పారావు బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాసిన్ బాబ్జి, సంస్థ సభ్యులు ,ఆశ్రమ వాసులు పాల్గొన్నారు.

Comments