Skip to main content

పాట్ హోల్స్ ను మరమ్మత్తు చేసే మొబైల్ యత్రాన్ని పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్.

 


విశాఖపట్నం మే 20: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో రహదారుల మరమ్మత్తులను వేగవంతంగా, నాణ్యతతో  అతి తక్కువ సమయంలో నిర్వహించేందుకు “పాట్ హోల్స్ బస్టర్స్ – ది రోడ్ డాక్టర్” అనే పేరుతో ఉన్న మొబైల్ మిషన్‌ ఎంతో ఉపయోగపడుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన సౌత్ జోన్ కలెక్టర్ ఆఫీస్ డౌన్ సూర్య హాస్పిటల్ సమీపంలో ట్రాన్స్ మెటలైట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రదర్శించిన “పాట్ హోల్స్ బస్టర్స్ – ది రోడ్ డాక్టర్” అనే మిషన్‌ ద్వారా పాట్ హోల్స్ మరమ్మత్తు చేసే ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా ట్రాన్స్ మెటలైట్ ఇండియా లిమిటెడ్ ప్రదర్శించిన “పాట్ హోల్స్ బస్టర్స్ – ది రోడ్ డాక్టర్” అనే మొబైల్ యంత్రాల సంస్థ చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ నిపుణ్ సోనీ పాట్ హోల్స్ తక్షణమే మరమ్మత్తులు చేసి రోడ్డు వేసే ప్రక్రియను కమిషనర్ కు వివరించారు.

ఈ సందర్భంగా పాట్ హోల్ ను మరమ్మత్తు చేసి రోడ్డుకు సమాంతరంగా యధావిధిగా రోడ్డు వేసి పూడ్చే యంత్ర ప్రక్రియను జీవీఎంసీ కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి ఒక పాట్ హోల్‌ను సుమారు 20 నిమిషాల వ్యవధిలోనే మరమ్మత్తు చేయగల సామర్థ్యం ఈ యంత్రానికి ఉందని తెలిపారు. ఈ యంత్రం రాతి పిక్క, తారు ను అదే వేడి చేసుకొని మిక్సింగ్ చేసుకుంటూ, ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అక్కడ ఈ యంత్రం ఆ గుంతను శుభ్రం చేసి యధావిధిగా రోడ్డుకు సమాంతరంగా గుంతను పూడ్చుతుందన్నారు. ఈ యంత్రం ఒక డ్రైవర్, నలుగురు కార్మికులతో పనిచేస్తుందన్నారు. నగరంలో వర్షాకాల సమయంలో ఏర్పడే గుంతలను త్వరితగతిన పూడ్చేందుకు ఈ మిషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కమిషనర్ అభిప్రాయపడ్డారు. అలాగే, 15వ ఆర్థిక సంఘం నిధులతో ఇటువంటి మిషన్ల కొనుగోలుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు సత్యనారాయణ రాజును కమిషనర్ ఆదేశించారు. నగర రహదారుల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ప్రజలకు, వాహనాల రాకపోకలకు మెరుగైన రహదారి సదుపాయాలు అందించవచ్చని పేర్కొన్నారు. ఈ మిషన్ వినియోగ విధానం, సాంకేతిక అంశాలను స్వయంగా కమిషనర్ పరిశీలించారు. 

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీరులు రాయల్ బాబు, తిరుమలరావు, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ

Comments