Skip to main content

ఉత్కంఠ భరితంగా సాగుతున్న జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు.... పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన ప్రముఖులు...


అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం శ్రీ సత్యనారాయణ గార్డెన్స్‌లో  ఎంపీ  జి.ఎం. హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ హెల్త్ అండ్ ఫిట్నెస్ క్లబ్ అసోసియేషన్ వారి నిర్వహిణలో 15వ జాతీయ స్థాయి సబ్‌ జూనియర్, జూనియర్ మెన్ అండ్ ఉమెన్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు  ఉత్సాహభరితంగా పోటాపోటీగా  కొనసాగుతున్నాయి. 


దేశంలోని 29 రాష్ట్రాల నుంచి వచ్చిన పవర్ లిప్టింగ్ క్రీడాకారులు తమ క్రీడా ప్రతిభను చాటుతున్నారని ఆర్గనైజింగ్ సెక్రటరీ కంకిపాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు. 4 వ రోజు సాయంత్రం జరిగిన 84 కేజీ మెన్ సబ్ జూనియర్ అండ్  జూనియర్ విజేతలకు 


 జనసేన నాయకులు కల్వకొలను తాతాజీ బహుమతులను  అందజేశారు.  తాతాజీ  మాట్లాడుతూ, కోనసీమ  మారుమూల ప్రాంతంలో దేశములో క్రీడాకారులు తమ ప్రతిభ కనబర్చుకొను వేదిక చేసినందుకు ముందుగా ఎంపీ  హరీష్ కు ప్రత్యేక  ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  


ఇసుకపట్ల రఘుబాబు, ఆంధ్రప్రదేశ్ చైల్డ్ హక్కుల కమిషన్ మెంబెర్ కొప్పుల మానస, రాష్ట్ర హ్యాండీక్యాప్డ్ డైరెక్టర్  ఆర్డిఎస్ ప్రసాద్,నల్లా అజయ్, వెలగట్ల జగదీష్, నల్లా సంజయ్, నల్లా వెంకటేశ్వరరావు, జంపన సుమన్ వర్మ, ఏడిద శ్రీను, ఆకుల సూర్య నారాయణ మూర్తి, సుధా చిన్న, మహా దశ నాగేశ్వరరావు,అడపా చిన్న, కుమార్, చిట్టి బాబు,  ఆశెట్టి ఆదిబాబు తదితరులు  పాల్గొన్నారు.
Srinivas Spl Correspondant 

Comments