అమలాపురం..విశాఖ సందేసం...అమలాపురం ఆకాశం హాస్పిటల్ లో కొలిచెల డ్రీమ్ వర్క్స్ బ్యానర్లో కోనసీమ అమలాపురం పరిసర ప్రాంతంలో నెల రోజులపాటు సినిమా షూటింగ్ "పొడగంటిమయ్యా పురుషోత్తమా"అనే చిత్రం చిత్రీకరణ జరుగుతుందని ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులు హీరోగా యతేంద్ర,హీరోయిన్ గా రమ్యప్రియ కథానాయకులుగా ముఖ్య పాత్రలో తనికెళ్ల భరణి,
మీర్,దయానంద్ రెడ్డి, గణిశెట్టి రమణలాల్ నటిస్తుండగా ఈ సినిమాకు డైరెక్టర్ అడపా ఫణీంద్ర,కెమెరామెన్ సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ అవినాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పవన్ కుమార్ తమ్మినేని, వ్యవహరిస్తుండగా చిత్ర నిర్మాత కొలిచెల సురేఖ నిర్మాణ సారధ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేననాయకులు కల్వకొలను తాతాజీ ముఖ్యఅతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాల్లో కొబ్బరికాయలు కొట్టి ఘనంగా ప్రారంభించారు. హీరో హీరోయిన్ల పై ముఖ్య సన్నివేశంపై తాతాజీ క్లాప్ కొట్టగా పట్టణ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కొల్లాటి దుర్గాబాయి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.ఈ కార్యక్రమంలో
సన్నవిల్లి మాజీ సర్పంచ్ చిక్కం పెదబాబు,అమలాపురం సినీనటులు గుర్రం రామకృష్ణ, డి.ఎస్.ఎన్ కుమార్ యెరుబండి చంటి,జర్నలిస్ట్ దడాల త్రిమూర్తులు, ఆదుర్తి శ్రీనివాస్, శ్రీనివాస్ సూర్య,అయినాల శ్రీనివాస్, కల్వకొలను మూర్తి తదితరులు పాల్గొన్నారని సినిమా మేనేజర్ డి. రాజేష్ బాబు లోకల్ మేనేజర్ దుర్గారావు తెలిపారు. సినిమా షూటింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన ఆకాశం హాస్పిటల్ యాజమాన్యానికి సినిమా డైరెక్టర్ అడపా ఫణీంద్ర ధన్యవాదాలు తెలిపారు.
Srinivas Spl Correspondant



Comments
Post a Comment