ఆక్వా రంగంలో సిండికేట్ వ్యవస్థ నిర్ములించాలంటూ ఆక్వా ఆందోళన.... జిల్లా కలెక్టరేట్ వద్ద ఆక్వా రైతులు భారీ నినాదాలు
అమలాపురం, విశాఖ సందేసం....రొయ్యల మేత రేటు తగ్గించాలని, రొయ్యల రేటు తక్షణమే పెంచాలంటూ ఆక్వా రైతు జిల్లా నాయకులు దెందుకూరి సత్తిబాబు రాజు, త్సవటపల్లి నాగభూషణం ఆధ్వర్యంలో ఆక్వా రైతులు డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టి నినాదాలు చేశారు. దెందుకూరి సత్తిబాబు రాజు మాట్లాడుతూ సిండికేట్ వ్యవస్థతో ఆక్వా రంగం నాశనం అయిపోయిందని, సిండికేట్ ను ప్రభుత్వం విచ్చినం చేయాలని డిమాండ్ చేశారు.
త్సవటపల్లి నాగభూషణం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులకు ఇచ్చిన విద్యుత్ సబ్సిడీ హామీ రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న ఇప్పటికి నెరవేర్చలేదని అన్నారు. వెంటిలేటర్ పై ఆక్వా రంగం ఉన్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని, రొయ్య మేత ధరలు ఆకాశాన్ని తాకుతూ రొయ్యల కొనుగోలు ధరలు పాతలానికి పడిపోతున్న తరుణంలో నిరూత్సహ స్థితిలో ఆక్వా రైతులు మగ్గిపోతున్నారని అన్నారు. అనంతరం ప్రజా పిర్యాదుల పరిస్కార వేదికలో ఆక్వా రైతులు పిర్యాదు చేశామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పందించి ఫీడ్, ఎక్స్పోర్ట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారని ఆక్వా రైతు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెడా డైరెక్టర్ దేశంశెట్టి లక్ష్మీ నారాయణ, జిల్లా కార్యదర్శి త్సవటపల్లి మణికుమార్, మోటూరి నాని, రుద్రరాజు కాశీ రాజు, గుండిపూడి బాల, సూదా రఘవేంద్ర, కోటిపల్లి సతీష్, టి.శ్రీనివాసరావు, మేకల గురు, మేడిద శంకరరావు, కడలి వెంకటేశ్వరరావు, పచ్చిమల ఏడుకొండలు, నంద్యాల వెంకటేశ్వరరావు, గాలిదేవర గంగాధర రామారావు, ఆకేటి పెద్ద, నల్లా ఏడుకొండలు, కురసా కృష్ణ, బసవా మురళి, తదితరులు పాల్గొన్నారు.
Srinivas Spl Correspondant


Comments
Post a Comment