Skip to main content

మట్టపల్లి హనుమంతరావు గారిని సత్కరిస్తున్న వివేకనంద సంస్థ సభ్యులు..


ప్రేమ సమాజం అధ్యక్షులు, చల్మాజీ ఇన్ఫ్రా(infra) ప్రాజెక్టు చైర్మన్, నూతనంగా ఎన్నిక కాబడిన విశాఖపట్నం సత్యనారాయణ స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు మెంబరు గా ప్రమాణ స్వీకారం చేసి , స్వామివారికి సేవలు అందిస్తున్న మట్టపల్లి హనుమంతరావు గారిని శ్రీ స్వామి వివేకానంద సంస్థ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.


 ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ, విశాఖ అన్నదాత చలమయ్య గారి కాలం నుంచి ఇప్పటివరకు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల వివేకనంద ఆశ్రమమునకు నిత్య అన్నదానానికి ప్రతి నెల 5 బస్తాల బియ్యం అందిస్తున్నట్లు, పలు సందర్భాలలో ఆశ్రమమునకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలియజేస్తూ, ముందు ముందు మరెన్నో ఉన్నత పదవులను చేరుకోవాలని, ఆయన సేవలు మరింత విజయవంతంగా ముందుకు కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సత్తిబాబు, మహిళా సభ్యులు ఉమాదేవి, కనక మహాలక్ష్మి, సుజాత, సావిత్రి మొదలైన వారు పాల్గొన్నారు.

Comments