చిరస్మరణీయుడు నందమూరి తారకరామారావు : టీడీపీ మండల అధ్యక్షులు దెందుకూరి సత్తిబాబురాజు..... వేగిరాజు వెంకటరాజు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి....
అల్లవరం, విశాఖ సందేసం.....స్వర్గీయ నందమూరి తారక రామారావు పేద ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ చిరస్మరణీయుడుగా నిలిచి ఉంటారని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, అల్లవరం టీడీపీ మండల అధ్యక్షులు దెందుకూరి సత్తిబాబు రాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అల్లవరం ప్రవేటు ఫంక్షన్ హాలులో క్లస్టర్ 7 ఇంచార్జ్ వేగిరాజు వెంకటరాజు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సత్తిబాబు రాజు కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అందజేశారు. సత్తిబాబు రాజు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పధకాలు అందించిన ఘనత ఎన్టీఆర్ దక్కుతుందన్నారు.
పెట్రోలు డిజిల్ అదా చేయాలని దేశప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మహానాడు కార్యక్రమం డిజిటల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించడం గర్వించదగ్గ విషయామన్నారు. వెంకటరాజు మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం నియోజకవర్గం మండలాలలో క్లస్టర్ స్థాయిలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రెండు రోజులు నిర్వహించిన మహానాడు కార్యమానికి హాజరై విజయవంతం చేసిన నాయకులకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోసంగి స్టాలిన్ బాబు, పోలిశెట్టి భాస్కరరావు, కాకిలేటి సూరిబాబు, కోపనాతి తాతాజీ, గిడుగు భాస్కరరావు, వడ్డి సుభాషిణి, పోతుల నాగరాజు, పశ్చిమాల ఏడుకొండలు, శివ, గుబ్బల నాగేశ్వరావు, గుర్రం శారద, కడలి వెంకట రమణ, అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Srinivas Spl Correspondant



Comments
Post a Comment