భీమిలి, మే 19:_ భీమిలి నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులతో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు. విశాఖలో సింహాచలం, కనక మహాలక్ష్మి అమ్మవారి తర్వాత అంతటి ప్రాముఖ్యం గల భీమిలి నూకాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. చురకల రమణ, బర్రి రాజు, కుప్పిలి దుర్గ, రామాయణం రాజ్యలక్ష్మి, గుసివాడ ప్రవల్లిక, గరికిన సత్యం, నక్కెళ్ళ వెంకటేశ్వరరావు, దౌలుపల్లి త్రినాథరావులను సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం, వారి అభిప్రాయం తీసుకుని చురకల రమణను చైర్మన్ గా సభా ముఖంగా గంటా ప్రకటించారు. అంతకు ముందు గంటా నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు పంచకర్ల సందీప్, కురుమిన రామస్వామి నాయుడు, కైలాష్ రెడ్డి, కె. రామానాయుడు, గాడు వెంకటప్పడు, చిక్కాల విజయ్ బాబు, గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర, కనకల అప్పలనాయుడు, సరగడ అప్పారావు, గాడు చిన్ని కుమారి లక్ష్మి, కొప్పల రమేష్, దండి వెంకటేష్, శాఖారి శ్రీనివాస్, వై.అనిల్ ప్రసాద్, గరే గుర్నాథ్, బోని ప్రసాద్, పీవీ నరసింహం, కాకర రమణ తదితరులు పాల్గొన్నారు.
K.V.SHARMA EDITOR


Comments
Post a Comment