దేశానికీ ఆర్మీ జవాన్ నాగబాబు సేవలు మరువలేనివి : ఎంపీ హరీష్ మాధుర్.... బోడసకుర్రులో నిలువెత్తు నాగబాబు విగ్రహం ఆవిష్కరించిన ఎంపీ....
అల్లవరం, విశాఖ సందేసం....దేశానికీ ఆర్మీ జవాన్ నాగబాబు సేవలు మరువలేనివని అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ అన్నారు.
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్మీ జవాన్‌కు బోడసకుర్రు గ్రామస్థులు ఘన నివాళులర్పించారు. అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన దివంగత ఆర్మీ జవాన్ బడుగు నాగబాబు నిలువెత్తు విగ్రహాన్ని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఆవిష్కరించారు.
బోడసకుర్రు గ్రామానికి చెందిన బడుగు నాగబాబు గత 24 సంవత్సరాలుగా భారత ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వహించారు. దేశ సేవలో కొనసాగుతున్న సమయంలో అనారోగ్యానికి గురైన నాగబాబు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వగ్రామానికి వచ్చి చికిత్స పొందుతూ మృతి చెందారు. దేశ రక్షణలో సేవలందించిన నాగబాబు స్మారకార్థం గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, శుక్రవారం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాగబాబు సేవలను కొనియాడిన ఎంపీ, ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకూరు సాయిరాం, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Srinivas Spl Correspondant



Comments
Post a Comment