Skip to main content

జివి కరుణాకర్ సేవలు మరువలేనివి- బాజపా*


 బిజేపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి, మలక్ పేట నియోజకవర్గం లో ఎన్నికల్లో పోటీ చేసి 18000 ఓట్లు సాధించిందిన బిజేపి సీనియర్ నాయకులు  జివి కరునాకర్ ఇటీవల స్వర్గస్తులయ్యారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ఇరవై సూత్రాల సంఘం చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పార్టీకి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో గాజువాక ఇంచార్జ్ రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు (కేఎన్ఆర్) , నాని, సుబ్బిరామిరెడ్డి ,పావని ,మంజుల ,రామ్ కుమార్,దానేష్ ,నాగేశ్వరరావు, మోహన్ రాజు ,తదితరులు పాల్గొన్నారు.

             D.S . Varma Sr Sub EDITOR 

Comments