మనోగతం
అవగతం
చేసుకోవడం
మరో మనిషికే
సాధ్యం.
మనిషి మనస్సు
పరి పరి పరిణామా
లకు మూలం.
పరి పరి విధాల
పరిభ్రమిస్తూ
ఉంటుంది.
ఎప్పుడు ఎటు
పయనిస్తుందో
తెలియదు.
జాలి, దయ,
కరుణ, కారుణ్యం,
వినయం,
విధేయత,
వివేకం కానరావు,
అందరిలో.
మనస్సు
మాయ మయం
భ్రమ, చంచలం
దేనికోసమో
ప్రాకులాట,
వెతుకులాట.
మనిషికి
ఆమూలాగ్రo
'మర్మం' తప్ప
కర్మ ఫలం తో
పని లేదంటాడు.
మనిషి ఒక
పయో ముఖ
విష కుంభం
లాంటి వాడు.
తాను బయటకు
వ్యక్త పరిచేది
ఒకటి, అంతర్లీ
నంగా దాగి ఉన్నది
మరొకటి.
మర్మం లేని
మనిషి ఉండడు
నేడు. మనిషి
కీర్తి, కాంత,
కనకం కోసం
ప్రాకులాడతాడు.
అటు వైపే
తన నిత్య పయనం.
మనిషి తన
తోటి మనిషిని
అణచి ముందుకు
సాగాలనుకుంటాడు
నీతి నియమాలు
గుర్తుకు రావు.
బంధాలు, బాంధవ్యాలు,
బంధుత్వాలు
ప్రక్కన పెడతాడు.
మనిషి మూలాలు
అటువంటివి
అనుకోవాలా!
నిలువెత్తు విషం.
విచక్షణ కు
తావివ్వడు.
తన స్వార్ధం
కోసం దేనికైనా
సిద్ధ పడతాడు.
పరిణామాలు
ఎలా ఉన్న
తనకు అనవసరం.
తను అనుకున్నది
సాధించడమే
లక్ష్యం. ప్రతి ఫలం
కోసం ప్రాకులాట.
పాప భీతి లేదు,
ధర్మా, అధర్మ
విచక్షణ అంత
కన్నా లేదు.
పదవీ కాంక్ష
కొందరిలో,
ధన దాహం
మరి కొందరిలో,
ఆస్తుల కోసం
ఆరాటం, పోరాటం
ఇంకొదరిలో,
కామ వాంఛ ,
ఇలా ఎవరిని
తట్టి చూసినా
వారి వారి
లక్ష్యాలు
వెలుగు లోకి
వస్తాయి.
వాటిని నర
వేర్చుకోవడానికి
దేనికైనా సిద్ధ
పడతారు.
తప్పు అని
తెలిసిన
చేయక మానరు.
మానవ మాతృల
మనోగతాలు
వేరు, వేరు.
మనిషికి
మనో సంకల్పం,
మనో వికాసం,
మనో నిబ్బరం,
కావాలి. తన
మనోగతం ను
అటు వైపు
మరల్చాలి,
అప్పుడే
మానవుడే
దానవుడు
సమాజ
హితుడౌతాడు.
Dr. నండూరి రామకృష్ణ
Sr Sub EDITOR
26-5-2026

Comments
Post a Comment