Skip to main content

ఆక్వా సిండికేట్ వ్యవస్థపై చర్యలు తీసుకోవాలంటూ ఆక్వా రైతులు నిరసన.... ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే ఆనందరావుకు వినతిపత్రం......

 


అమలాపురం, విశాఖ సందేసం....ప్రజా సమస్యల పరిష్కరానికి ఎన్. డి. ఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమనికి ఆక్వా రైతు నాయకులు దెందుకూరి సత్తిబాబు రాజు ఆధ్వర్యంలో ఆక్వా రైతులు ర్యాలీగా వెళ్లి మేత ధరలు తగ్గించి రొయ్యల రేటు పెంచాలని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు వినతిపత్రం అందజేశారు...ప్రభుత్వం ఆక్వా రైతులను ఆడుకోవాలని మేత కంపెనీల సిండికేట్ వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.....


సత్తిబాబు రాజు మాట్లాడుతూ రొయ్యల కొనుగోలు కంపెనీలు, మేత కంపెనీలు ఒక్కటై ఆక్వా రైతుల నడ్డి విరుస్తూ మేత ధరను పెంచితే కూటమి ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసిందని అక్కసుతో రొయ్యల కొనుగోలు ధరను కంపెనీలు తగ్గించయని అగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆక్వా రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.


ఆక్వా రైతు నాయకులు నాగభూషణం మాట్లాడుతూ ఆక్వా రంగం వెంటిలేటర్ పైన ఉందని ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే ప్రజాదర్బార్ లో విన్నవించుకున్నామని, ముఖ్యంగా మేత కంపెనీలు, ఎక్స్పోర్ట్ కంపెనీలు సీడ్ కంపెనీలు ఒక్కరి ఆధిపత్యంలో ఉండడంతో 100 కౌంట్ రొయ్యల రేటును వారం రోజులలో 275 రూపాయల నుండి 215 రూపాయలకు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు..ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలే నేడు ఆక్వా రైతుల పాటి శాపంలా మారాయన్నారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు వెన్నంటే ఉండి అభివృద్ధికి కృషిచేస్తుందని అన్నారు. ఈ సమస్యలను కుడా త్వరలో పరిష్కరిస్తామని ఆక్వా రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అల్లూరి ర‌మేష్ రాజు, దెందుకూరి దుర్గ‌రాజు, వేగిరాజు వెంక‌ట‌రాజు, స‌త్తి శ్రీ‌ను, వాసు రాజు, మోటూరి కిర‌ణ్, అధికారి బాబ్జి అధిక సంఖ్యలో ఆక్వా రైతులు పాల్గొన్నారు

               Srinivas Spl Correspondant 

Comments