Skip to main content

కార్మికుల సమస్యలపై యూనియన్ ప్రతినిధులతో జీవీఎంసీ కమిషనర్ సమావేశం.


 విశాఖపట్నం మే 19: పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం వారికి కల్పించే మౌలిక సదుపాయాలు జీతభత్యాలకు ఎటువంటి ఇబ్బందు లేకుండా చూస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి. నరేష్ కుమార్, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు పి. వెంకటరెడ్డి ఇతర ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించారు. 


ముందుగా యూనియన్ ప్రతినిధుల సమస్యలను తెలపాలని జీవీఎంసీ కమిషనర్ సిఐటియు ప్రతినిధులను కోరగా జీవీఎంసీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ, జీవీఎంసీ కమిషనర్ పై మాకు పూర్తి నమ్మకం ఉందని, కమీషనర్ ఒప్పందాలు, మినిట్స్ అమలు చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా నీటి సరఫరా, వెటర్నరీ ,పార్కులలో కార్మికులు, రిటైర్డ్, అకాల మరణం పొందిన కార్మికుల కుటుంబంలోని ఒకరికి ఉద్యోగ కల్పన, లోడర్లకు వేతనాలు పెంపుదల, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం మౌలిక సదుపాయాలు మహిళా పారిశుద్ధ్య కార్మికుల రక్షణ,  అలవెన్స్ లపై ఉన్న బకాయిలు, విలీన  కార్మికులకు పీఎఫ్ సొమ్ము, కార్మికుల సప్లమెంటరీ జీతాలు మొదలైన సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా..,  కమిషనర్ స్పందిస్తూ, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జీవీఎంసీలో అంతర్భాగంగా పనిచేయాలని ముఖ్యంగా కార్మికుల సంక్షేమానికి పనిచేయడం అభినందనీయమని కమిషనర్ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల వలనే నగర పరిశుభ్రతతో పాటు నగరానికి మంచి గుర్తింపు వస్తుందని అటువంటి కార్మికుల హక్కుల పరిరక్షణకు జీవీఎంసీ సిద్ధంగా ఉందని, ప్రస్తుతం కౌన్సిల్ కాలం లేనందున స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉన్నందున మీరు అందించే జీవోలు, మెమోలు మాకు సపోర్టుగా ఉంటాయని తెలిపారు. అదనంగా నియమించిన కార్మికుల జీతాలు నిర్ణీత సమయంలో ఇచ్చేందుకు ప్రతి నెల 20వ తేదీ నుండి 26వ తేదీ లోపల జీతాల బిల్లులను సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. యూనియన్ ప్రతినిధులు కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చిన మినిట్స్ లో ప్రతి అంశాన్ని  పరిశీలించేందుకు జీవీఎంసీ అదనపు కమిషనర్ ,ప్రధాన వైద్యాధికారి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, తాగునీటి విభాగం పర్యవేక్షక ఇంజనీర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని, కార్మికులు ప్రతి అంశం వారితో చర్చించి ప్రభుత్వం జీవో లేదా మెమో ప్రకారం అమలు చేసేందుకు ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని యూనియన్ ప్రతినిధులకు తెలిపారు. మీరు మినిట్స్ లో ఇచ్చిన ప్రతి అంశం సాధ్యమైనంత వరకు అమలు చేసే చేస్తామని కమిషనర్ యూనియన్ ప్రతినిధులకు  కమిషనర్ భరోసాను ఇచ్చారు. 


ఈ సమావేశంలో ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి.వాసుదేవ రెడ్డి సహాయక ఎగ్జామినర్  ఆఫ్ అకౌంట్స్ అరుణకుమారి ,పర్యవేక్షక ఇంజనీర్లు పల్లంరాజు, రాయల్ బాబు, సంపత్ కుమార్, ఏ డి హెచ్ వాసుకి, స్పోర్ట్స్ డైరెక్టర్ (ఇన్చార్జ్) ఈ.ఏ.రాజు ,అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పద్మజ, యూనియన్ అధ్యక్షులు టి.నూకరాజు ప్రధాన కార్యదర్శి యు.రాజు ఇతర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

            పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ

                      K.V.SHARMA EDITOR 

Comments