Skip to main content

బత్తిన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా మహానాడు వేడుకలు


విశాఖ: విశాఖ సందేశం
: విశాఖ దక్షిణనియోజకవర్గం 31వార్డులో మహానాడు 2026 వేడుకలు వార్డు అధ్యక్షుడు బత్తిన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్  సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిధిగా హాజరై పార్టీ వ్యవస్థాపకుడు     ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజమే దేవాలయ ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ మాటలను తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నారని ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ వ్యాఖ్యానించారు.యువనేత  నారా లోకేష్ బాబు కార్యాకర్తలే అధినేతలు అంటూ తరచూ చెప్పే మాటలను నిజంచేస్తూ  సీనియర్ నాయకులను, కార్యాకర్తలను గౌరవిస్తూ  దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్  సీతంరాజు సుధాకర్ సమక్షంలో వార్డు అధ్యక్షుడు బత్తిన నవీన్ కుమార్ శాలువాతో సత్కరించారు.


 అనంతరం నవీన్ కుమార్  మాట్లాడుతూ స్త్రీ-శక్తి, మహిళా సాధికారత పార్టీ చేసే కార్యక్రమాలు,  కార్యాకర్తల సంక్షేమం కోసం లోకేష్ బాబు తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించారు.లోకేష్ బాబు మాటలే ఆదర్శం తీసుకొని కార్యాకర్తల సంక్షేమ కోసం ఎల్లపుడు పాటుపడుతూ, అందరికి అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా నవీన్ తెలిపారు.


 ఈ కార్యక్రమంలో రాష్ట్రకార్యదర్శి, క్లస్టర్ ఇంచార్జ్ గాయత్రి ఫణికుమారి, కో క్లస్టర్ పల్లానగేష్, వార్డు సెక్రటరీ పేదిరెడ్ల అప్పలరాజు, సీనియర్ నాయకులు డీ మూర్తి,జక్కన వెంకటరావు,కేవీ శర్మ, బీ రమాదేవి,శారదదేవి,కేపీ రాజు అర్జీ రాజేష్ బూత్ ఇంచార్జ్లు కే శంకర్,పల్లా శ్రీను,లావణ్య హేమలత, బీ లక్ష్మి, విజయ, వెంకటరావు,దేవి,సిహెచ్ కృష్ణ, బజన కృష్ణ, గౌరీ,సౌజన్య, కనకరాజు,ఏ లక్ష్మి, త్రినాద్, అప్పలరాజు, కే ఈశ్వరరావు తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

Comments