ఒక మహానుభావుడి రూపకర్త, ఇంకొక్క విజనరీ నాయకుడు కార్యదక్షత, ఇంకొక్క నాయకుడి భవిష్యత్తు ప్రణాళిక.. వీళ్ల ముగ్గురిని నడిపించి.. నడిపిస్తున్న పార్టీ కోసం ప్రాణ త్యాగానికి అయిన సిద్ధపడిన కార్యకర్త.. ఇవ్వన్నీ కలిపిన తెలుగుజాతి గర్వపడే తెలుగుదేశం పార్టీ.
• తెలుగుదేశంపార్టీ ఏటా జరుపుకునే ఈ ‘మహానాడు’ నిజంగా ఒక పండుగ, జాతర అనే చెప్పాలి.
• ఈ మహానాడు అనేది రాజకీయ సభ కాదు.. బలప్రదర్శన కాదు.. తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీకి దిశానిర్దేశం ఇచ్చుకుని, భవిష్యత్తు ప్రణాళికలను ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లడాలనే చెప్పేందుకు ఉపయోగపడే ఒక సభ.
• తెలుగుజాతి ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ గారు.
• యువగళం అధినేత, ఎంతోమంది యువకుల గళంగా నిలబడిన నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
• ఈ మహానాడు వేదికగా రాజకీయ తీర్మానాన్ని బలపరిచే అవకాశం సామాన్య కార్యకర్తను అయిన నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.
• ఈ మహానాడును మహిళలకు అంకితం చేసిన విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు మహిళలందరి తరపున ధన్యవాదాలు.
• నాడు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచే మహిళలు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు.
• నేడు దేశంలో ఎక్కడ లేని విధంగా చట్టసభల్లో మహిళలు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీది.
• ప్రతిపక్షాలు కూడా తెలుగుదేశం పార్టీ వేసిన బాటలో వచ్చి వారి సత్తా ఏంటో నిరూపించుకోవాలి.
• ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం పని చేసి.. ప్రజలకు సంక్షేమం అందజేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే.
• ఈ 44 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అవమానాలు, అటుపోట్లను తట్టుకుని నిలబడ్డారు.
• చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంశాలను తీసుకుంటే ఎన్నో సినిమాలు తీయొచ్చు.
• 2014లో రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అనుభవం కలిగిన నాయకుడు కావాలని రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి విజయాన్ని అందించాడు.
• ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికి అన్నిటిని అధిగమించి మన రాష్ట్రానికి అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. పోలవరం పనులను కూడా పరుగులు పెట్టించారు.
• అ రోజు రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2 వేలకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదే.
• అ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు.
• 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఓటమికి గురైన తరువాత రాష్ట్రంలో విధ్వంసాక పాలన మొదలైంది.
• ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన పాలన ఐదేళ్లు అలానే కొనసాగింది.
• అమరావతే రాజధానిగా ఉండాలని మహిళలు బయటకి వస్తే బుటు కాళ్లతో తన్నించాడు.
• యువనేత నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు అధికార మదంతో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు.
• అనాడు నారా లోకేష్ గారిని యువగళం కోసం పంపించిన నారా భువనమ్మకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి.
• ఆయనకు ఆధికారంలో కొత్తేమి కాదు.. తాత సీఎం, తండ్రి సీఎం, ఆయనే మంత్రిగా చేశారు.. అయిన కూడా రాష్ట్ర యువత కోసం ముందుకు వచ్చారు.
• రోజుకు ఒక్కసారి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్న వాళ్లకి లాగా గొడళ్లు చేతుల్లో పెట్టి బయటకు పంపించే పార్టీ మాది కాదు.
• నా చేతులు రాజ్యాంగం ఉంది.. దానికి అనుగుణంగానే ముందుకు సాగుతానని చెప్పిన నాయకుడు మా తెలుగుదేశం పార్టీ యువనేత.
• అధికారంలో ఉన్నప్పుడు ఒకలా... అధికారం పోయిన తరువాత ఒకలా ఉంటుంది గొడ్డలి పార్టీలో.
• దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన మనిషిని పక్కన పెట్టుకుని తరువాత మండలికి పంపిన నీచపు ఘనత గొడ్డలి పార్టీది.
• కానీ, మా నాయకుడు పీ4 విధానంలో బంగారు కుటుంబాలను తయారు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.
• అధికారం ఉన్న.. లేకపోయినా కూడా నేను పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తానని చెప్పిన నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు.
• రానున్న 15 ఏళ్లు కాదు.. 20 ఏళ్లు ఇదే ప్రభుత్వం కొనసాగితే.. 2047 నాటికి దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ నిలబడుతుంది... రాసిపెట్టుకోండి..

Comments
Post a Comment