Skip to main content

శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, సింహాచలం. ​భక్తుల కోరిక మేరకు ‘స్వాతి హోమం’ టికెట్ల గడువు పొడిగింపు........................ఆలయ ఈవో జె. వెంకట్రావు.


సింహాచలం:తేది: 27 మే 2026
:సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని, ఈనెల 29వ తేదీన (శుక్రవారం) ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా "స్వాతి హోమం" నిర్వహించ తలపెట్టినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి  శ్రీ జె. వెంకట్రావు  ఒక ప్రకటనలో తెలిపారు.

​ఈ విశిష్ట హోమానికి సంబంధించిన భక్తుల టిక్కెట్ల విక్రయ గడువు నిజానికి బుధవారం మే 27 ముగియవలసి ఉంది. అయితే, ఈ హోమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా ఆసక్తి చూపడం, టికెట్ల గడువును పెంచాలని పెద్ద ఎత్తున అభ్యర్థించడంతో, భక్తుల కోరిక మేరకు ఈ సదవకాశాన్ని కల్పిస్తూ మే 28వ తేదీ (గురువారం) కూడా టికెట్లు అందుబాటులో ఉంచాలని ఆలయ కార్య నిర్వహణాధికారి నిర్ణయించారు.

భక్తుల సౌకర్యార్థం, రద్దీని దృష్టిలో ఉంచుకుని టికెట్ల కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేయడం జరిగింది.

​భక్తులు ఈ క్రింది డిజిటల్ మార్గాల ద్వారా మే 28న కూడా తమ స్వాతి హోమం టికెట్లను సులభంగా పొందవచ్చు.

​ ఆలయ అధికారిక వెబ్‌సైట్ సందర్శించి బుక్ చేసుకోవచ్చు.

మన ​మిత్ర WhatsApp ద్వారా , చాట్ చేసి టికెట్ పొందవచ్చు.ఆలయ పరిసరాల్లోని కియాస్క్ ల ద్వారా.

ప్రత్యేక కౌంటర్ల వద్ద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తక్షణమే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

భక్తులు కోరినందున ఈ ప్రత్యేక అవకాశాన్ని కల్పించడమైనదని, కావున భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి, లభించిన అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈవో జె. వెంకట్రావు తెలియజేశారు . డిజిటల్ మార్గాల ద్వారా ముందస్తుగానే టికెట్లు పొంది, స్వాతి హోమంలో పాల్గొని ఆ వరాహ నరసింహ స్వామి వారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.


Comments