Skip to main content

శ్రీ సత్య సాయి సేవా సమితి, ఉక్కునగరం *ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మూగజీవులకు దాహ నివారణ సేవ*

 


విశాఖపట్నం, :విశాఖ సందేశం : మే 21,తీవ్రమైన ఎండల నేపథ్యంలో మూగజీవుల పట్ల కరుణాభావంతో ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు విశిష్ట సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉక్కునగరం సెక్టార్-2లోని శ్రీ సత్యసాయి మందిరం బయట ప్రతిరోజూ కుండల్లో స్వచ్ఛమైన తాగునీటిని ఏర్పాటు చేసి ఆవులు, గేదెలు, కుక్కపిల్లలు తదితర మూగజీవుల దాహాన్ని తీర్చుతున్నారు.

అలాగే, మండుతున్న వేసవి వేడిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా ప్రతిరోజూ వేలాది మంది ప్రజలకు చల్లని తాగునీరు అందిస్తూ సేవలందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలను అందుకుంటోంది.


పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన పశువులు ఈ నీటిని తాగుతూ ఉపశమనం పొందుతున్న దృశ్యాలు అందరినీ కదిలిస్తున్నాయి. “మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ సమితి సభ్యులు ఈ సేవను నిరంతరం కొనసాగిస్తున్నారు.

ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు ప్రశంసిస్తూ, మూగజీవుల పట్ల ప్రేమాభిమానాలను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని కోరుతున్నారు.

Comments