Skip to main content

వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ కు శంకుస్థాపన*

 


రుషికొండ, మే 18:_ రుషికొండ బీచ్ లో ఓషన్ వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ కు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం శంకుస్థాపన చేశారు. 1.5 ఎకరాల్లో రూ.3.35 కోట్లతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్), వి.ఎం.ఆర్.డి.ఎ. సంయుక్తంగా ఈ సెంటర్ ను నిర్మించనున్నాయి. సర్ఫింగ్, కయాకింగ్, కన్నోయింగ్, సెయిలింగ్, స్టాండ్ అప్ పాడింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్  కు అవసరమైన సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తారు. ఆయా స్పోర్ట్స్ కు సంబంధించి క్రీడాకారులకు అవసరమైన శిక్షణనిస్తారు. ప్రస్తుతం రుషికొండ బీచ్ లో స్పీడ్ బోటింగ్, స్కూబా డైవింగ్, జెట్ స్కీ, వించ్ పారా సెయిలింగ్, పారా మోటార్ తదితర స్పోర్ట్స్  అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో శాప్ చైర్మన్ ఎ.రవి నాయుడు, వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ జూన్ గాలియట్, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, శాప్ డైరక్టర్లు మేడిది రాజా, బుచ్చిరాజు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, లొడగల అప్పారావు, శాఖారి శ్రీనివాస్, చెట్టుపల్లి సన్యాసిరావు, నాగోతి సత్యనారాయణ, లొడగల రామ్మోహన్, సారిపల్లి శ్రీనివాస్, అక్కరబోయిన రాంబాబు, నాగరాజు, దొరబాబు, నాగలక్ష్మి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

                   K V SHARMA EDITOR 


Comments