Skip to main content

భూ వివాదాల పరిష్కారంలో తహసిల్దార్లు, సర్వేయర్లు బాధ్యాతా యుతంగా వ్యవహరించాలని జాయింట్ కలక్టర్ జి.విద్యాదరి అన్నారు.


 విశాఖపట్నం:విశాఖ సందేశం: మే 19 :  భూ వివాదాల పరిష్కారంలో తహసిల్దార్లు, సర్వేయర్లు బాధ్యాతా యుతంగా వ్యవహరించాలని జాయింట్ కలక్టర్ జి.విద్యాదరి అన్నారు.   మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లాలో తహసల్దార్లు, డి.టిలు, సర్వేయర్లతో రీ సర్వే ఆర్ అండ్ ఆర్ ప్రజా ఫిర్యాదులు పరిష్కారం తరితర అంశాలలో వ్యవహరించాల్సిన తీరుపై జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో జాయింట్ కలక్టర్ మాట్లాడుతూ రీ సర్వే, ఫీల్డ్ సర్వ్లో వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించి పరిష్కారమైనట్లుగా వారికి తెలియజేయాలన్నారు.   ప్రజా ఫిర్యాదుల పరిష్కారములో అర్జీ దారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.  ఆర్ అండ్ ఆర్ లో మ్యుటేషన్లు జరిగితే ఆ రైతుకు తెలియజేయాలని, తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా రైతులకు తెలియజేయాలని తెలిపారు.  ఈ సమావేశంలో ఉప సంచాలకులు సర్వే కే.రమణ మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే రామకృష్ణ, డిప్యూటి కలక్టర్ గోవింద్, కో ఆర్డినేషన్ణ్ పర్యవేక్షకులు  శ్యాం రామప్రసాద్ , తహసిల్దార్లు పాల్గొన్నారు.

                 K.V.SHARMA EDITOR 

Comments