సింహాచలం 25 మే 2026. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) జస్టిస్ రమేష్ సిన్హా తమ కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన గౌరవ ప్రధాన న్యాయమూర్తి కి సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె. వెంకట్రావు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ రమేష్ సిన్హా ఆలయ సాంప్రదాయం ప్రకారం, అత్యంత మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందిన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు గౌరవ ప్రధాన న్యాయమూర్తి కి మరియు వారి కుటుంబ సభ్యులకు మంత్రోచ్ఛారణలతో వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ జె. వెంకట్రావు జస్టిస్ రమేష్ సిన్హా ని స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి, స్వామివారి పవిత్ర ప్రసాదాలను మరియు జ్ఞాపికగా స్వామివారి దివ్య సుందర రూప చిత్రపటాన్ని బహుకరించారు.
K.V.SHARMA EDITOR
-

Comments
Post a Comment