Skip to main content

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు*


బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ రోజు అనగా 25-05-2026 న విశాఖ జిల్లాలో గల పలు సమస్యల పై జిల్లా కలెక్టర్ గారికి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మాట్లాడుతూ జిల్లాలో “పొదుపు జాగ్రత్తలు – బాధ్యతాయుత జీవన విధానం” పై సమగ్ర ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాస రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్, జనతా వారధి కో కన్వీనర్  మూలా వెంకటరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు K విజయబాబు, చల్ల మంజుల, రూపాకుల రవి కుమార్, కాళ్ళ అశోక్ కుమార్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
                    D.S.Varma Sr Sub EDITOR 

Comments