జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు*
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ రోజు అనగా 18-05-2026 న విశాఖ జిల్లాలో గల పలు సమస్యల పై జిల్లా కలెక్టర్ గారికి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చెరువు మట్టి తవ్వకాలపై నిబంధనలు కచ్చితంగా అమలు చేసి గత పాలనలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి, రైతులకు మరియు కుమ్మరి వృత్తిదారులకు చెరువు మట్టిని ఉచితంగా అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాస రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments
Post a Comment