SC మోర్చా జిల్లా అధ్యక్షులు ములకలపల్లి ప్రకాష్ జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం*
ఈరోజు 25 -05 -2026 సోమవారం ఉదయం బీజేపీ SC మోర్చా జిల్లా అధ్యక్షులు ములకలపల్లి ప్రకాష్ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు గారు రక్తదాన కార్యక్రమంలో తమ రక్తాన్ని ఇచ్చిన వ్యక్తులకు డోనార్ సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు K విజయబాబు, చల్ల మంజుల, SC మోర్చా జోనల్ ఇంచార్జి కోడూరు సంజీవరావు, ఈతలపాక విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
D.S.Varma Sr Sub EDITOR

Comments
Post a Comment