Skip to main content

జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 01.06.2026


ఈరోజు అనగా తేది. 01.06.2026 న
డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు జూన్ 1 నుండి 30 వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా జెండా ఊపి ర్యాలీ ప్రారంబించారు. ఈ ర్యాలీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి సత్యం కూడలి మీదుగా జరిగింది. డా.పి.జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ “దోమల నియంత్రణ–మలేరియా నివారణ” ప్రతి సంవత్సరం జూన్ నెలను మలేరియా వ్యతిరేక మాసోత్సవాలుగా నిర్వహిస్తారు. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో దోమల పెరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి కీటక జనిత వ్యాధుల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. 

శ్రీ వర ప్రసాద రెడ్డి, జిల్లా మలేరియా అధికారి వారు మాట్లాడుతూ మలేరియా అనేది ఆడ అనోఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపించే వ్యాధి. ఇది జ్వరం, వణుకు, తలనొప్పి, చెమటలు, నీరసం వంటి లక్షణాలను కలిగిస్తుంది. మలేరియా లక్షణాలు గురించి వివరిస్తూ తరచుగా జ్వరం రావడం, వణుకుతో కూడిన జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, అధిక చెమటలు, బలహీనత, నీరసం వంటి లక్షణాలు కనపడతాయని వివరించారు. మరియు మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. నీరు నిల్వ ఉండకుండా చూడండి. నీటి ట్యాంకులు, డ్రమ్‌లు, బకెట్లను మూతపెట్టండి. కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, పగిలిన పాత్రలు వంటి వాటిలో నీరు నిల్వ కాకుండా తొలగించండి. రాత్రి సమయంలో దోమతెరలను ఉపయోగించండి. పూర్తి చేతుల దుస్తులు ధరించండి. కిటికీలు, తలుపులకు దోమ జాలర్లు(మెష్ )ఏర్పాటు చేసుకోండి. అవసరమైతే దోమల నివారణ మందులు, రిపెలెంట్లు ఉపయోగించండి అని తెలియచేసారు. జ్వరం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే ఆశా కార్యకర్త, ANM లేదా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. రక్త పరీక్ష చేయించుకోండి. సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా చికిత్స పొందండి. వైద్యుల సూచనలు పూర్తిగా పాటించండి. మన బాధ్యత – మన ఆరోగ్యం “ప్రతి శుక్రవారం – డ్రై డే పాటిద్దాం” ఇంటి చుట్టూ, పైకప్పులపై, కూలర్లలో, పూల కుండీలలో నిల్వ నీటిని తొలగిద్దాం. ప్రజల భాగస్వామ్యంతోనే మలేరియా నిర్మూలన సాధ్యం. దోమల పెరుగుదలను అరికడదాం – మలేరియాను నివారిద్దాం! ఆరోగ్యకరమైన కుటుంబం – సురక్షితమైన సమాజం! అని పిలుపునిచ్చారు. 

శ్రీ బి.నాగేశ్వర రావు డెమో వారు మలేరియా రహిత సమాజం దిశగా ఇప్పుడు మనం సాదించగలం, ఇప్పుడు మనం తప్పక సాదించాలి అని మలేరియా నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు, జిల్లా మలేరియా సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

    జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

           విశాఖపట్నం

              K.V.SHARMA EDITOR 

Comments