జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 01.06.2026
ఈరోజు అనగా తేది. 01.06.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు కింగ్ జార్జ్ హాస్పిటల్ లో గల ఎన్.ఆర్.సి. ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో సిబ్బంది హాజరు, వారి పనితీరు పరిశీలించి, సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలని ఆదేశించారు.
తదుపరి కింగ్ జార్జ్ హాస్పిటల్ లో గల డి.ఇ.ఐ.సి విభాగాన్ని పరిశీలించి సిబ్బంది పనితీరును సమీక్షించారు. డి.ఇ.ఐ.సి విభాగం లో గల పాడైపోయిన, మరమ్మత్తుకు కు పనికిరాని ఎ.సి. లను పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఈ సందర్శనలో డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ-ఎన్.హెచ్.ఎం, వారు, శ్రీమతి శాంతిప్రియ, జిల్లా డి.ఇ.ఐ.సి మేనేజర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విశాఖపట్నం
K.V.SHARMA EDITOR



Comments
Post a Comment