Skip to main content

జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది: 03.06.2026

.                    K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం:విశాఖ సందేశం
: .పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారి అధ్యక్షతన 7 గురు ART, సరోగసి బృందం తో కలిసి శ్రీ వెంకటరమణ హాస్పిటల్ (ART లెవెల్-1), కృష్ణ నగర్, మహారాణిపేట, విశాఖపట్నం, నిర్మల హాస్పిటల్ (ART లెవెల్-1), మురళి నగర్, విశాఖపట్నం లను తనిఖీ చేసారు. ఈ తనిఖీ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డా.పి.జగదీశ్వర రావు వారు సదరు కేంద్రముల వారికి పలు సూచనలు చేసారు. ఆపరేషన్ థియేటర్, వార్డ్, స్కానింగ్ మెషిన్ తనిఖీ చేసారు. ఈ పై ఆసుపత్రులు ART కేంద్రముల నిర్వహణకు అనుమతులు కలవో లేవో అని డాక్టర్స్, స్టాఫ్ యొక్క విద్యార్హతలు, ల్యాబ్ పరికరములు పరిశీలించి తగు సలహాలు ఇచ్చారు. ఈ కేంద్రములలో పేదవారికి కూడా ఫీజు తగ్గించి తీసుకోవాలని కోరారు. 


ఈ తనిఖీ బృందం లో డా.విద్యారమ, గైనకాలజిస్ట్, VGH, డా.వందన శశికిరణ్, రేడియోలజిస్ట్, KGH, డా.సోభశ్రీ, సోషియాలజిస్ట్, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీమతి ఎల్.వి.రమణి, NGO, శ్రీ కె.శివాజీ, మానిటరింగ్ కన్సల్టెంట్, డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ, శ్రీ బి.నాగేశ్వర రావు, డెమో, మొదలగు సభ్యులు పాల్గొన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

విశాఖపట్నం

Comments