Skip to main content

జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 04.06.2026


ఈరోజు అనగా తేదీ 04.06.2026
న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, వేములవలస వి.హెచ్.సి. లను సందర్శించి అక్కడ జరుగుతున్న  ఇ.హెచ్.ఆర్., ఇ-ఔషది, ప్రసవాలు, ల్యాబ్ టెస్ట్లు, మందులు లభ్యత, అభ ఐడి రిజిస్ట్రేషన్, ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట (పబ్లిక్ పెర్సప్షన్),


 కె.పి.ఐ. ఇండికేటర్స్, ఎఫ్.ఆర్.ఎస్. హాజరు మొదలగు విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది అందరూ ఆరోగ్య కేంద్రములో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తీవ్ర వేసవి దృష్ట్యా ORS పాకెట్స్ అన్ని సచివలయల్లోను, అంగన్వాడి కేంద్రాలలోను, NREGS పని ప్రదేసల్లోను భారి నిర్మాణాలు జరుగుతున్నప్రదేసల్లోను అందుబాటు లో ఉంచాలి అని ఆదేశించారు. వేసవి లో తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల ప్రజల్లో అవగహన కలిపించాలని సూచించారు. ఎపిడెమిక్ వ్యాధుల అవుట్ బ్రేక్ రాకుండా PHC పరిధి లో ఉన్న అన్ని తగు నీట వసతులు మరియు నీటి సరఫరా పైపు లు తరచూ తనఖి చేయాలనీ ఆదేశించారు.  


అర్హులైన 14 ఏళ్ళ ఆడపిల్లలకు విధి గా HPV వాక్సిన్ ఇవ్వాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం చేపట్టిన PUBLIC PERCEPTION పట్ల ప్రజాల్లో అవగాహన కలిపించాలని PUBLIC PERCEPTION లో negative feedback వచినట్లు అయితే ఆయా facilities పై తగిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించడం జరిగింది. ఏప్రిల్  నెల కి గాను రాష్ట్ర స్థాయి లో ఆనందపురం ప్రాదమిక ఆరోగ్య కేంద్రం ప్రదమ స్థానం లో నిలవడం పట్ల అభినందనలు తెలియచేసారు. 

ఈ సందర్శనలో డా.బి.ఉమావతి, డీపీఎంఓ, ఆరోగ్య కేంద్ర వైద్యులు డా : షకిన భాను, డా: శేహనజ్ బేగం మరియు సిబ్బంది పాల్గొన్నారు.  

 జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

                                  విశాఖపట్నం

Comments