Skip to main content

జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 06.06.2026

.                K.V . SHARMA EDITOR 
ఈరోజు అనగా తేదీ 06.06.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు పెదగంట్యాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రమును సందర్శించి అక్కడ జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, హెచ్.పి.వి.వాక్సిన్ కార్యక్రమమును పరిశీలించి తగు సూచనలు చేశారు. తదుపరి ఇ.హెచ్.ఆర్., అభ ఐడి రిజిస్ట్రేషన్, ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట (పబ్లిక్ పెర్సప్షన్), కె.పి.ఐ. ఇండికేటర్స్, ఆర్.బి.ఎస్.కె సేవలు, ఓపి, ఐపి సేవలు, ల్యాబ్ టెస్ట్ లు, మందులు లభ్యత,  ఎఫ్.ఆర్.ఎస్. హాజరు మొదలగు విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. ఒ.ఆర్.ఎస్. పాకెట్స్ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది అందరూ ఆరోగ్య కేంద్రములో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.  

ఈ సందర్శనలో ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.  

                 జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

                             విశాఖపట్నం



            

Comments