పాఠశాలలలో మౌళిక సదుపాయాలు అభివృద్దే లక్ష్యం : ట్రస్ట్ అధ్యక్షులు మోసుగంటి వెంకటేశ్వరరావు... 10 సీలింగ్ ఫ్యాన్లు,20యల్.ఇడి. ట్యూబ్ లైట్లు అందజేత...
. SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం....అల్లవరం మండలం గోడి గ్రామంలోని డా.బి. ఆర్. అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలకు మోసుగంటి గంగయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ మరియు రుద్రరాజు సీతాపతిరాజు మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో రూ.25 వేలు
విలువ చేసే 10 సీలింగ్ ఫ్యాన్లు,20యల్.ఇడి. ట్యూబ్ లైట్లును గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ యన్.శ్రీనివాస్ కు మంగళవారం అందజేశారు. ఈ సందర్బంగా ట్రస్టు అధ్యక్షులు మోసుగంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గురుకుల పాఠశాలల ఆవశ్యకతను విద్యార్థులకు వివరిస్తూ, ఎందరో విద్యార్థులు ఈ గురుకుల పాఠశాలలో చదివి ఉన్నత స్థాయి ఉద్యోగాలలో స్థిర పడ్డారని,ఇక్కడ ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా బాగా చదువుకుని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు.
జిల్లాలోని సుమారుగా 11 మండలాల్లో వివిధ పాఠశాలలకు అందిస్తున్న మౌలిక సదుపాయాల కల్పనను, వైద్య సేవలను ప్రశంసిస్తూ ఈ రెండు ట్రస్టుల సేవలను ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు రుద్రరాజు రమేష్ రాజు, బత్తుల నకులరాజు ,తోట బాలకృష్ణ,ఉప్పే నరసింహారావు ,శెట్టిబత్తుల సత్యనారాయణ,మోసుగంటి విజయకుమారి, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Comments
Post a Comment