Skip to main content

వీసీబీ డివిడెండ్ 10 శాతం*-ది విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ చైర్మన్ జే.వీ. సత్యనారాయణ మూర్తి ప్రకటన

                      K .V. SHARMA EDITOR


విశాఖపట్నం, ( జూన్ 21) ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ ఈ ఏడాది డివిడెండ్ ను 10 శాతంగా పాలకవర్గం నిర్ణయించినట్లు వీ సీబీ చైర్మన్ జే.వీ సత్యనారాయణమూర్తి ప్రకటించారు. లాభాలలో డివిడెంట్ మొత్తంగా రూ 39. 24 కోట్లుగా ఉందని, మిగతా లాభాలను చట్టపరంగా నిర్దేశించిన నిష్పత్తులలో ఆయా ఖాతాలకు జమ చేస్తామని జే.వీ.సత్యనారాయణమూర్తి తెలిపారు. వీసీబీ మహాజన సభ  ఆదివారం సిరిపురం విఎంఆర్డిఏ వుడా చిల్డ్రన్స్ ఎరిన లో జరిగింది . ఈ సభకు బ్యాంకు అధ్యక్షులు జామిశెట్టి వెంకట సత్యనారాయణ మూర్తి  అధ్యక్షత వహించి ఈ సభ ఎజెండా అయిన 2025-26 ఆర్థిక సంవత్సరం పరిపాలనా నివేదిక, 2025-26 ఆడిట్ రిపోర్ట్ లను ప్రవేశ పెట్టడం, ఆమోదించడం, గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఆర్జించిన లాభాల పంపిణీ, సవరించిన, అంచనా బడ్జెట్ లను ఆమోదించడం, 2026-27 సంవత్సరానికి స్టాట్యూటరి ఆడిటర్ నియామకం గురించి విశదీకరించారు.

జె.వి సత్యనారాయణ మూర్తి  తన అధ్యక్షోపన్యాసంలో  2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లలో రూ.240.24 కోట్ల పెరుగుదలతో రూ.4594.97 కోట్లకు చేరుకుని 5.52 శాతం వృద్ధి సాధించిందని, రుణాలలో రూ.440.95 కోట్ల పెరుగుదలతో రూ.3877.42 కోట్లకు చేరుకుని 12.83 శాతం వృద్ధి నమోదు చేసిందని, బ్యాంకు వ్యాపారం రూ.681.19 కోట్ల పెరుగుదలతో రూ.8472.39 కోట్లకు చేరుకుని 8.74 శాతం వృద్ధి నమోదు చేసిందని తెలియజేశారు.


ది విశాఖపట్నం కోఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ (వీసీబీఎల్) ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.66.15 కోట్లు నికర లాభం ఆర్జించిందని, 60 బ్రాంచిలు గల తమ బ్యాంకు పరిధిలో 1,17,884 మంది సభ్యులున్నట్లు జె. వి. సత్యనారాయణ మూర్తి వివరించారు. వీసీబీలో షేరు ధనం రూ.416.25 కోట్లుకు చేరుకుందన్నారు. రిజర్వు బ్యాంకు తాజా నిబంధనల ప్రకారం ఈ ఏడాది 8 కొత్త బ్రాంచిలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరకు నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, మార్కాపురం జిల్లాలలో ఒక్కొక్క బ్రాంచిని, విశాఖ నగరంలో ఒకటి, తెలంగాణ లోని వరంగల్, ఖమ్మం లతో పాటు మన రాష్ట్ర రాజధాని ప్రాంతంలో మరో బ్రాంచిని ప్రారంభించుకుని బ్రాంచిల సంఖ్య 68 కి చేర్చాలని  నిర్దేశించుకున్నట్లు  జె వి సత్య నారాయణ మూర్తి తెలిపారు. విజయవాడ లోని స్వశక్తి  మర్కంటైల్ బ్యాంకు, గుంటూరు లోని మహిళా కోపరేటివ్ బ్యాంకు, సాలూరు కోపరేటివ్ బ్యాంకుల విలీన ప్రతిపాదన లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గాజువాకలో బ్రాంచికు,విజయవాడ పటమటలో జోనల్ కార్యాలయం,  బ్రాంచి సొంత భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. 

సమావేశంలో వివిధ బ్రాంచీల నుంచి ప్రతినిధులుగా వచ్చిన సంప్రదింపుల కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేశారు.  సభ్యులు చేసిన పలు సూచనలకు వివరణాత్మకంగా బ్యాంకు ఉపాధ్యక్షులు చలసాని రాఘవేంద్రరావు  విశదికరించారు. 

బ్యాంకు పూర్వ అధ్యక్షులు మానం ఆంజనేయులు  మాట్లాడుతూ సంప్రదింపుల కమిటీ సభ్యులు తమ బాధ్యతలను గుర్తించి బ్యాంకు పురోభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

సభలో డైరెక్టర్ శ్రీ వి. చంద్రశేఖర్ , డైరెక్టర్ డా. సి. కృష్ణ మోహన్ ,  ఉప్పలపాటి పార్వతిదేవి, చలసాని రాఘవేంద్ర రావు  97వ రాజ్యాంగ సవరణలను ఖండిస్తూ ప్రతిపాదించిన తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది.

ఈ కార్యక్రమంలో బ్యాంకు పూర్వ అధ్యక్షులు మానం అంజనేయులు , బ్యాంకు ఉపాధ్యక్షులు  చలసాని రాఘవేంద్ర రావు, డైరెక్టర్లు సూర్పనేని నాగభూషణ చౌదరి,  ఏజే స్టాలిన్‌, సీఏ  వి. చంద్రశేఖర్, గుళ్లపల్లి జనార్ధనరావు,  సిహెచ్. ఆదినారాయణ శాస్త్రి,  కే. ప్రసాదరావు, ఉప్పలపాటి పార్వతిదేవి,  సి. కోటేశ్వరరావు, పి. వెంకట స్వామి, డా.సి. కృష్ణమోహనరావు, ఎ.రామకృష్ణారావు, శ

ఈమని అవని, సి.హెచ్.రామారావు,  పి.వి. నరసింహమూర్తి, సీఏ   పి.వి. మల్లికార్జున రావు, సీఎంఏ   జె ప్రసాద్,  కేసరి నిర్మల,  కె. శ్రీకాంత్ బాబు,  డి. బాబురావు(కో ఆప్టెడ్‌),  సి ఆర్ సుకుమార్(కో ఆప్టెడ్‌),  సిఈఓ 


 వివిబి వరలక్ష్మి, డిప్యూటీ సిఈవో యం.వి.గణేష్ కుమార్, జి.యం.  యం.వి.ఎస్.ఎస్.ఎన్. ప్రసాద్ , 60 బ్రాంచిల ప్రతినిధులు, బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





Comments